నేనిప్పుడు
పొట్లకాయల వాక్యాలను
సొరకాయల సమాసాలను
బీరకాయల సంధులను
టమాటాల జాతీయాలను
ఆకుకూరల సామెతలను
కొత్తిమీరకరివేపాకుల అలంకారాలను
విచక్షణా ద్రావణంలో కడిగి
అనల్పార్ధముక్కలుగా సమకూర్చుకొన్నాను
నేనిప్పుడు
భాషాభాండంలో
ఉల్లిపాయల ఉపమానాలు
తాలింపుగింజల రూపకాలు వేసి
శనగనూనె శిల్పంలో పోపు వేశాను
తగినంత నిజాయితీ కారం తగిలించి
చితికెడంత హెచ్చరికల పసుపు చల్లి
చటాకంత చమత్కార లవణం దట్టించాను
నేనిప్పుడు
శ్రీశ్రీ కవితావరణంలో
కుందుర్తి రచనాపాకంలో
బలమైన ఆహార వస్తువుతో కలిపి
జీవరసాల సారాన్ని మేళవించి
మనిషితనాన్ని ప్రోదిచేసేటట్టు
ఆలోచనల విద్యుత్తు పొయ్యి మీద
వచన కవితను పచనం చేస్తున్నాను.
పొట్లకాయల వాక్యాలను
సొరకాయల సమాసాలను
బీరకాయల సంధులను
టమాటాల జాతీయాలను
ఆకుకూరల సామెతలను
కొత్తిమీరకరివేపాకుల అలంకారాలను
విచక్షణా ద్రావణంలో కడిగి
అనల్పార్ధముక్కలుగా సమకూర్చుకొన్నాను
నేనిప్పుడు
భాషాభాండంలో
ఉల్లిపాయల ఉపమానాలు
తాలింపుగింజల రూపకాలు వేసి
శనగనూనె శిల్పంలో పోపు వేశాను
తగినంత నిజాయితీ కారం తగిలించి
చితికెడంత హెచ్చరికల పసుపు చల్లి
చటాకంత చమత్కార లవణం దట్టించాను
నేనిప్పుడు
శ్రీశ్రీ కవితావరణంలో
కుందుర్తి రచనాపాకంలో
బలమైన ఆహార వస్తువుతో కలిపి
జీవరసాల సారాన్ని మేళవించి
మనిషితనాన్ని ప్రోదిచేసేటట్టు
ఆలోచనల విద్యుత్తు పొయ్యి మీద
వచన కవితను పచనం చేస్తున్నాను.
No comments:
Post a Comment